.. Cci కమర్షియల్ ట్రేడింగ్ లో పత్తి 12 వేలకు కొనాలి..
భైంసా రూరల్ మార్చ్21 జనం సాక్షి
Cci కమర్షియల్ ట్రేడింగ్ ద్వారా 12 వేలకు పత్తిని కొనుగోలు చేయాలని బైంసా మాజీ ఎంపీపీ రాం చందర్ రెడ్డి,అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు డిమాండ్ చేశారు.మంగళవారం బైంసా మండలంలోని హంపోలి గ్రామంలో అమ్మకుండా నిల్వ ఉంచిన పత్తి నిల్వలను గ్రామస్థులతో కలిసి పరిశీలించారు.ప్రారంభంలో 9000 ధర పలికిన పత్తి,రేట్ దిగి ఇప్పుడు 7000 చేరుకుందని,దీనితో రైతులు బైంసా డివిజన్ లో 60% ఇండ్లలోనే నిలువ ఉంచుకొని ఎదురు చూస్తున్నారని వివరించారు.కేంద్ర ప్రభుత్వం పత్తి కనీస మద్దతు ధర ఎం ఎస్ పి నిర్ణయంలో సరిగా పెట్టుబడులను లెక్కించక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. అధిక వర్సాలతో దిగుబడులు తగ్గి రైతులు నష్టాలలో ఉన్నారు, కాబట్టి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయిస్తే 12 వేల రూ అవుతుందని,ఈ ధర రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.cci ని కమర్షియల్ ట్రేడింగ్ లో దించాలని ,చివరి వరకు కొనుగోలు చేయాలని,లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో aikms జిల్లా నాయకులు దీనాజి,దిగంబర్ పాటిల్,లక్ష్మణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.




