Friday, 6 November 2026

సేవ లొనే ఉంది వెలకట్టలేని సంతృప్తి…..ఎంపీపీ రమాదేవి

సేవ లొనే ఉంది వెలకట్టలేని సంతృప్తి…..ఎంపీపీ రమాదేవి
ఫొటో : దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎంపీపీ.
నెన్నెల, డిసెంబర్ 17, (జనంసాక్షి )
అవసరమైన సమయంలో మనకు చేతనైన సేవ చేయడం లో వెలకట్టలేని సంతృప్తి ఉంటుందని ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. శనివారం నెన్నెల మండలంలోని మారుమూల గ్రామమైన ధమ్మిరెడ్డి పేటలో వృద్దులకు చలి దుప్పట్లు పంపిణీ, కొత్తూరు లోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు క్రీడా వస్తువులను మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహా సభ దాతల సహకారంతో పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇలాంటి మారుమూల గ్రామాలను ఎంచుకోని వృద్దులకు,చిన్నారులకు చేయుతనందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తు లో ఇలాంటి కార్యక్రమాలను చేయడానికి ముందుకు రావాలని ఆకాక్షించారు. వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ స్వర్ణలత మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ఉద్యోగ పరంగా వందల కోట్ల రుణాలు ఇప్పించిన కలగని సంతృప్తి ఈ సేవ కార్యక్రమంతో ఆనంద పడ్డామని తెలిపారు. ఈ ఉత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగ ఆసనాలు, విన్యాసాలు పలువురిని మంత్ర ముగ్ధులను చేశాయి.ధీంతో పాటు జెండా వెంకట పూర్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్కూరి పూజితకు వై ఆర్ పి ఫౌండేషన్ అందించిన లక్ష రూపాయల చెక్కును అందించారు. తల్లిదండ్రులను సన్మానించారు..కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ మల్లేష్,సర్పంచ్ లు మల్లయ్య, బాపు, దాతలు కిరణ్, శ్రీరాములు, సత్యనారాయణ, యాదగిరి, నరేందుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు