సేవ సంకల్పం సమాజం లో స్పూర్తిని‌ స్తుంది ..

కోల్సీటీ, అక్టోబర్ ౧౦,(జనంసాక్షి):
సినీయర్ లయన్, ఇక్కడి ప్రముఖ వ్యాపార వేత్త గుగ్గిళ్ళ రవీంద్ర చారి – ఉమాదేవి కూతురు శృతి పుట్టిన రోజు సందర్బంగా ఈ రోజు రామగుండం లయన్స్ క్లబ్ అధ్వర్యంలో… జ్యోతి గాంధీ పౌండేషన్ నిర్వహణలొ…గుగ్గిళ్ళ రవీంద్ర చారి‌ నేతృత్వంలో…
గోదావరిఖని కాకతీయ నగర్ అంగన్ వాడి బడిలొని‌ నిరుపేద కుటుంబాల చిన్నారులకు “పాకెట్ మనీ”ని రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయ లక్ష్మి చేతుల మీదుగా అందించారు…పిల్లల మధ్య బర్త్ డే కేక్ ను కట్ చేశారు.
పౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలొ అంగన్ వాడీ టీచర్ సంఘ బాధ్యులు స్వర్ణ లత, శారద, తిరుమల,పద్మ తదితరులు ఉన్నారు.