Tuesday, 3 November 2026

సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.