Thursday, 5 November 2026

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (25): మండల పరిధిలోని ఏదుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం స్థానిక ఎస్సై నవీద్ సైబర్ నేరాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాలు పై అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్ మోసాల కు పాల్పడకుండా విద్యార్థులు ఫోక్సొ చట్టాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు అనవసరమైన యాప్ లను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాల అకౌంట్లోకి నేరుగా వెళ్లే అవకాశం ఉందన్నారు గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ నెంబర్ ,బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పకూడదన్నారు ఒకవేళ ఎవరైనా అడిగితే మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు, ఉపాధ్యాయులు నరేంద్ర చారి, కురుమన్న, శ్రీనివాసులు, సాయిబాబు, గగనం సీనయ్య, రవి , గోపాల్, శ్రీదేవి, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు