బిచ్కుంద జూన్ 02 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను చైర్మన్ నాల్చర్ బాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సాధించగలిగామని, ప్రత్యేక రాష్ట్రం వల్ల అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకం, రైతు భీమా వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా రైతులకు న్యాయం చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, బొమ్మల లక్ష్మణ్ మరియు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సొసైటీలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవం




