సోనియా గాంధీ గొప్ప మహా నాయకురాలు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియాన్స్ (యుపిఏ) చైర్ పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం నాడు 76వ పడిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ  60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన మహా నాయకురాలు గరీబోడి దైవం ఉక్కు మహిళ ఇందిరమ్మకు వారసురాలు రాజీవ్ గాంధీ ఆలోచనలకు కార్యరూప మిచ్చిన దిశాలి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ 2013లో, ఫోర్బ్స్ పత్రిక సోనియాను ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతరాలైన స్త్రీగా పేర్కొంది 2007లో కూడా ఫోర్బ్స్ పత్రిక ఆమెను అదే స్థానంలో పేర్కొంది విశిష్ట జాబితాలో 2007లో 6వ ర్యాంకు ఇచ్చింది 2010లో ఫోర్బ్స్ సోనియాను అత్యంత శక్తివంతురాలైన మహిళ జాబితాలో 10వ స్థానంలో నిలబెట్టింది 2012లో ఫోర్బ్స్ శక్తివంతురాలైన వ్యక్తుల జాబితాలో 12వ వ్యక్తిగా పేర్కొంది2007, 2008 సంవత్సరాలకుగాను టైమ్ పత్రిక 100మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో చేర్చింది. న్యూ స్టేట్స్ మేన్ పత్రిక 2010 సంవత్సరంలో “ప్రపంచంలోని 50 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో 29వ స్థానం ఇచ్చింది సోనియా గాంధీ ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులలో ప్రథమ స్థానంలో ఉన్నారు భారతదేశానికి రెండు సార్లు ప్రధానిగా అవకాశం వచ్చిన ఆమె వేరే వారికి అవకాశం ఇచ్చారు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అంటూ కొనియాడారు, ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిన ఘనత కూడా సోనియాగాంధీకే దక్కుతుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్ర మరచిపోలేదని గుర్తుచేసుకున్నారు పార్టీ నేతలు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయేందుకు సోనియాగాంధీయే కారణమని తెలిపారు. సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా సేవలందించిన నాయకురాలు సోనియాగాంధీ.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు యువత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు