Wednesday, 4 November 2026

సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

పెన్ పహాడ్  జూన్ 02 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినా సందర్భంగా అధినాయకురాలు సోనియా గాంధీ చిత్రపటానికి పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సురేష్ రావు మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాన్ని గుర్తించి యువకుల ఆత్మహత్యలకు పాల్పడడం తెలుసుకొని నాడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతున్న తరుణంలో తమ నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని సంకల్పించి ఆమె నోటి ద్వారా వచ్చిన ప్రకటన వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన గుర్తు చేశారు నేడు అధికారాన్ని అనుభవిస్తున్న కెసిఆర్ తెలంగాణ ఇచ్చిన నాయకురాలు సోనియాగాంధీని మర్చిపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి రవీందర్, ఓగ్గు సైదులు, ఒగ్గు అంజయ్య, చింత దానియల్, శనగాని రాంబాబు, ఒగ్గు కాంతి, శివ నాయక్, నీలకంఠ0 మహేష్, షేక్ సైదులు, ఒగ్గు శంకర్, తదితరులు పాల్గొన్నారు…