Wednesday, 4 November 2026

సోమ్‌నాథ్‌ భారతికి ఎదురుదెబ్బ

ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సోమ్‌నాథ్ తనను వేధిస్తున్నాడని, హత్యాయత్నం కూడా చేశాడని అతని భార్య లిపికా చేసిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. దీంతో సోమ్‌నాథ్ ముందస్తు బెయిల్ కోసం స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు సైతం సోమ్ నాథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సోమ్‌నాథ్ తరఫు న్యాయవాది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *