స్కిల్ కేసులో చంద్రబాబకు భారీ ఊరట
` రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
` మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆంక్షలు తొలగింపు
` యధావిధిగా రాజకీయ కార్యకలాపల్లో పాల్గొనే వెసలుబాటు
విజయవాడ(జనంసాక్షి): స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడిరచింది. ఈనెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈనెల 28లోపు చంద్రబాబు హెల్త్ రిపోర్టును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించాలని ఆదేశించింది. ఈనెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని వెల్లడిరచింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, ఎసిబిక్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రేపో, మపో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించ నుంది. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో 53 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈనెల 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇటీవల స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవొలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఎ37గా సీఐడీ చేర్చింది. ఈ క్రమంలో హైకోర్టు అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభలు, ప్రెస్ విూట్లలో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని సూచించారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా పలుమార్లు బెయిల్ పై విచారణలు వాయిదా పడ్డాయి. అనంతరం, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు చికిత్స కోసం అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉండగా పూర్తి బెయిల్ మంజూరైంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.సెప్టెంబర్ 22 వరకూ రిమాండులో ఉన్న చంద్రబాబును, 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. అనంతరం సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్ విధించిన కోర్టు అక్టోబర్ 5 వరకూ దాన్ని కొనసాగించింది. అనంతరం విచారణ అనంతరం అక్టోబర్ 19 వరకూ చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. సుమారు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, నవంబర్ 24న సాయంత్రం చంద్రబాబు సరెండర్ కావాలని ఆదేశించింది. ఆయనకు అందించిన వైద్యం వివరాలను నివేదికలో సమర్పించాలని ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ’స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ?సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయ లేదని సీఐడీ చెప్పింది. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ కూడా లేదని సీఐడీ చెబుతోంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపించింది. జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదని సీఐడీ ఆరోపించింది.