Wednesday, 4 November 2026

స్కూలు బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మేళ్ల చెరువు మండలంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలుడిని స్కూల్‌ బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన యతిరజపురం తండాలో చోటు చేసుకుంది. యతిరాజాపురం తండాలో పిల్లలను ఎక్కించుకోవడానికి రామాపురానికి చెందిన శ్రీసాయి విద్యానికేతన్‌ స్కూల్‌ బస్సు వచ్చింది. తన స్నేహితుడు బస్సు ఎక్కిన అనంతరం బస్సు ముందు రోడ్డు దాటబోతున్నాడు బాలుడు జగదీష్‌(4). ఇది గమనించని డ్రైవర్‌ ముందుకు కదిలాడు. దీంతో బాలుడిని ఢీకొని తలపై వెనక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. దీంతో తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటన చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు.