Wednesday, 4 November 2026

స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభం.

 

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్: ఫిబ్రవరి 8( జనం సాక్షి)తోషం
గ్రామంలోని బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కౌట్స్ కోఆర్డినేటర్ యాదవ్ రావు ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అభిమాన్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ లనుపంపిణిచేశారు. ఈ సందర్భంగాఈ సందర్భంగా ప్రధానఉపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో రాణించాలని ఆకాంక్షించారు. స్కౌట్స్ తో విద్యార్థుల క్రమశిక్షణ మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంతరావు,కరణ్ సింగ్,ఈశ్వర్ సింగ్, రవీందర్ స్కౌట్స్ మాస్టర్స్ కాశీరాం, జంగు, సుభాష్, రామ్ చందర్, ఇంద్ర దేవి హెచ్ డబ్ల్యూఓ దూర్వ రాజేశ్వరి , ఉపాధ్యాయులుతదితరులు పాల్గొన్నారు.