స్థానిక యువతను నియమించాలి రామగుండము, అక్టోబర్ ౧౦,(జనంసాక్షి):

రామగుండం పట్టణంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో. స్థానిక యువతనే ప్రయివేట్ సెక్యూరిటీ గార్థులుగా నియమించాలని. టి ఎస్ జెన్ కొ. ట్రాన్స్ కో.రిటైర్డ్ ఎంప్లాయిస్ సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అహ్మద్ బాబు కోరారు. సోమవారం బీ థర్మల్ సూపరిండెన్ట్ ఇంజనీర్ విజేందర్ కు వినతి పత్రం ఇచ్చి కోరారు.కాగా జెన్ కొ ఎస్ ఇ విజేందర్ సా నుకూలంగా స్పందించి స్థానిక యువతకే అవకాశం కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో.విస్లావత్ సారయ్య నాయక్. కుక్క గంగ ప్రసాద్. ఫారుఖ్ ఖాన్. సలీమ్. జరుపుల శ్రీనివాస్. నిస్సార్. షఫీఖ్. తదితరులు పాల్గొన్నారు