Thursday, 5 November 2026

స్నేక్ కిరణ్ని కాటేసిన శ్వేతనాగు

స్నేక్ కిరణ్ని కాటేసిన శ్వేతనాగు

శివమొగ్గ : ఎలాంటి పామునైనా చాకచక్యంగా బంధించే స్నేక్ కిరణ్‌ను శ్వేతనాగు (తెల్ల నాగుపాము) కాటేసింది. శివమొగ్గ సమీపంలోని న్యూ మండ్లీ లే ఔట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న లే ఔట్‌లో నిర్మాణంలో ఉనప్న భవనం వద్ద షెడ్‌లో శ్వేతనాగు ఉన్నట్లు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు  ఫోన్ సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు.

పది నిమిషాల్లో దానిని అతను బంధించి, తన వద్ద ఉన్న సీసం బాటిల్‌లోకి వేసే సమయంలో మెరుపు వేగంతో వెనక్కు తిరిగి అతని కుడిచేతిపై కాటు వేసింది. పామును బాటిల్‌లో వేసి, తన స్నేహితుల సాయంతో సమీపంలోని కువెంపు నగర్‌లో ఉన్న  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే పరిస్థితి విషమించి అపస్మారకస్థితికి అతను చేరుకున్నాడు. వైద్యులు అతన్ని ఐసీయూ ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

అరుదైన పాము
తెల్ల రంగులో ఉండే నాగుపాములు చాలా అరుదుగా ఉంటాయని, వీటిని పట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత వేగవంతంగా కదిలే స్వభావమున్న ఈ పాములు అతి సూక్ష్మమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *