Thursday, 5 November 2026

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

శ్రీనగర్: భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని తంగ్‌మార్గ్ తహసీల్ బోంగామ్ గ్రామంలో నేడు ఉదయం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగివున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఈ చర్యతో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడుతూ బయటకు వచ్చారు. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పరారైన ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *