హైదరాబాద్,జూన్11(జనం సాక్షి): : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరద్ధరించాలంటూ కాంగ్రెస్ నేతలు ఈరోజు శాసనసభాపతి మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయస్థానం తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘పెన్ను దొంగలిస్తేనే ఉరిశిక్ష వేసినట్లు’గా విూ వైఖరి ఉందంటూ స్పీకర్‌ను గట్టిగా నిలదీశారు. రేవంత్ వ్యాఖ్యలతో చిన్నబుచ్చుకున్న స్పీకర్.. విూరు ఇలా మాట్లాడితే వెళ్లిపోతానని అన్నారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్‌రెడ్డిని వారించారు.




