స్పైస్ జెట్ కు తప్పిన పెను ప్రమాదం

wn9wsqk5కర్నాటక రాష్ట్రం హూబ్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టైరులో గాలితగ్గడంతో రన్వేపై ఒరిగింది. ఈ విమానంలో కర్నాటక రాష్ట్రం సమాచార శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఆయన పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. విమానంలోని 77మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.