Friday, 6 November 2026

స్మార్ట్‌ సిటీగా శ్రీకాకుళం

నగర సుందరీకరణ చర్యలకు శ్రీకారం: కమిషనర్‌

శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్మార్ట్‌ సిటీలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కవిూషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు శనివారం వెల్లడించారు. దీనిలో భాగంగా నగరంలోని రహదారులను 80 అడుగుల రహదారులుగా విస్తరించనున్నట్లు చెప్పారు. దీని కోసం రూ.10 కోట్ల నిధులను వెచ్చిస్తున్నామన్నారు. నగరంలో జరుగుతున్న రహదారుల విస్తరణ పనులను ఇంజనీరింగ్‌, ఇతర శాఖల అధికారులతో కలిసి శనివారం ఉదయం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. స్మార్ట్‌ సిటీలో భాగంగా నగరంలో రూ.10 కోట్లతో రహదారుల విస్తరణ పనులను చేపడుతున్నామని, నగరంలో 2.10 కిలోవిూటర్ల మేర 80 అడుగుల రహదారులుగా విస్తరింపచేస్తున్నామని చెప్పారు. మార్గమధ్యలో డివైడర్లు, అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ పైప్‌ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.6.80 కోట్ల నిధులు విడుదలయ్యాయని, టెండర్లను ఖరారు చేసి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. పంచాయతీరాజ్‌, జిల్లా పరిషత్‌, రెవిన్యూ, పోలీసు, ఆర్‌ అండ్‌ బి తదితర శాఖల సమన్వయంతో ఈ రహదారి విస్తరణ పనులను చేపడుతున్నామని, దీనికి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెప్పారు. రహదారి విస్తరణ పనులతో స్మార్ట్‌ సిటీగా

శ్రీకాకుళం రూపుదిద్దుకోనుందని, త్వరలో నగరం రూపురేఖలు మారనున్నాయన్నారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, జాతీయ రహదారి మెయిన్‌ ఎంట్రన్స్‌గా మారనుందని చెప్పారు. నవ భారత్‌ జంక్షన్‌ వద్ద రూ.1.50 కోట్లతో ప్రధాన ముఖ ద్వారాన్ని ఏర్పాటుచేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం నవ భారత్‌ జంక్షన్‌ నుండి పియన్‌ కాలనీ వరకు జరుగుతున్న పనుల పురోగతిని తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్య నిర్వహణ అధికారి బి.నగేష్‌, జిల్లా పంచాయతి అధికారి బి.కోటేశ్వరరావు, శ్రీకాకుళం తహశీల్దారు పి.మురళీకృష్ణ, నగరపాలక సంస్థ సహాయ కవిూషనర్‌ హేమవతి, కార్య నిర్వాహక ఇంజినీర్‌ సుగుణాకర్‌, టౌన్‌ ఎ/-లానింగ్‌ అధికారి దేవకుమార్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.