Tuesday, 3 November 2026

స్మృతి ఇరానీకి జడ్‌ కేటగిరీ భద్రత

కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీకి ప్రభుత్వం త్వరలో జడ్‌ కేటగిరీ భద్రత కల్పించనుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థి రోహిత వేముల ఆత్మహత్య అనంతరం ఢిల్లీలోని ఆమె కార్యాలయం ఎదుట విద్యార్ధులు రోజూ ధర్నా చేస్తున్న నేపథ్యంలో భద్రత పెంచాలని నిర్ణయించినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. నిజానికి, ప్రతి కేంద్ర మంత్రికి వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జెట్లీ, నితిన్‌గడ్కరీ, కిరణ్‌ రిజీజు, జితేంద్ర సింగ్‌లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఆర్‌ఎస్‌సఎస్‌ అగ్రనేత మోహన్‌ భగవత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షాకు మాత్రం జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. స్మృతి ఇరానీకి ప్రస్తుతం భద్రత చాలా తక్కువగా ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని దాడి చేసే అవకాశాలున్నాయన్న ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగా జడ్‌ కేటగిరీ భద్రతను కల్పించేందుకు హోం శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *