Tuesday, 3 November 2026

ఇదో ముందడుగు

C

– నౌకదళ సమీక్షలో రాష్ట్రపతి

విశాఖపట్టణం,ఫిబ్రవరి 6(జనంసాక్షి):సముద్ర తీర రక్షణలో నౌకాదళ సవిూక్ష కొత్త ముందడుగు అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.  హిందూ మహాసముద్రంలో భారత్‌ నిర్వహిస్తున్న భూమిక అత్యంత ప్రధానమైందని అభివర్ణించారు. సముద్ర మార్గాల రక్షణ, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు నౌకాదళం అండగా ఉంటుందన్నారు. నౌకాదళానికి సహకారం అందించిన విశాఖ వాసులకు రాష్ట్రపతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ తూర్పు తీరంలో తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సవిూక్ష అట్టహాసంగా సాగింది.70 విదేశీ యుద్ధనౌకల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించి, నౌకాదళ సవిూక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంతర్జాతీయ నౌకాదళ గౌరవ వందనం స్వీకరించడం అద్భుతమైన అనుభూతినిచ్చిందన్నారు. సాగర మధ్యంలో ఈ పరేడ్‌ ప్రపంచంతో స్నేహహస్తానికి నిదర్శమని పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకాదళ సవిూక్ష అనుకున్న దానికన్నా అధిక ఫలితాలు ఇచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నౌకలు మనతీరానికి రావడం గర్వకారణమని అన్నారు. సముద్ర తీర రక్షణలో నౌకాదళ సవిూక్ష కొత్త ముందడుగు అన్న ప్రణబ్‌… శాంతి సామరస్యాలు కాపాడటంలో సంయుక్త ప్రదర్శనలు గొప్ప బలాన్నిస్తాయన్నారు. సముద్రతలంపై శాంతి, ప్రశాంతి నెలకొల్పడంలో నౌకాదళాలది కీలక భూమిక అని పేర్కొన్నారు.నౌకాదళ సవిూక్షలో రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి పారికర్‌, గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.  ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, తెలుగు రాష్టాల్ర ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నౌకాదళ ప్రధాన అధికారులు ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో విశాఖ నగరానికి అభిముఖంగా సాగర జలాల్లోకి చేరుకున్నారు. సుమిత్ర యుద్ధనౌకను మరో ఐదు నౌకలు అనుసరించాయి. ఆరు వరుసల్లో నిలిపి ఉంచిన 70 యుద్ధనౌకల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. నౌకాదళ సవిూక్ష సవిూక్షలో మొత్తం 90 యుద్ధ నౌకలు పాల్గొనున్నాయి. నౌకా దళ సవిూక్షను వీక్షేందుకు వేలాదిగా సందర్శకులు తరలిరావడంతో విశాఖ సాగరతీరం జన సంద్రంగా మారింది. విశాఖ తూర్పు తీరంలో నౌకాదళ సవిూక్ష నిర్వహించడం ఇదే తొలిసారి.

ఆహ్లాదకరంగా విశాఖతీరం

నీలిరంగు ఆకాశం కిందకు దిగితే.. ఆ ఆకాశంలో హంసలు విహరిస్తేఎలా ఉంటుంది. పై నుంచి పున్నమి చంద్రుడు కుంచె పట్టుకుని సముద్రంపై సాగరకన్యను చిత్రించి.. రంగులద్దితే ఎలా ఉంటుంది. విశాఖ సాగరతీరంలో యుద్ధ నౌకల విహారం అలాగే ఉంది. ఎంతో ఆహ్లాదంగా విశాఖ తీరం సందడిఆ కనిపిస్తోంది.  ఏరువాకలా సాగిన తెరచాపల కవాతు దీనికి తోడవటంతో.. అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన 70కి పైగా యుద్ధనౌకలు బాడీ బిల్డింగ్‌ పోటీల్లో కండలు చూపించడానికే అన్నట్లు ఆరు వరుసల్లో కవాతు సముద్ర అలలపై కవాతు నిర్వహిస్తున్నాయి. కాని యుద్ధంలో రణభేరి మోగించే నౌకల్లా కాకుండా, అందాల పోటీకి వచ్చిన వయ్యారి భామల్లా సముద్రనీటిపై గంభీరంగా..కదులుతూ.. చూపరులకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. విశాఖ సాగర తీరంలో కనపడుతున్న ఈ దృశ్యం అద్భుతం..అమోఘం. 70 యుద్ధనౌకలు ఒకదాని తర్వాత ఒకటి నేలపై నడిచే గజరాజుల్లా.. నీటిపై పయనించనున్నాయి. ఆ ప్రదర్శనను తిలకిస్తూ గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ యుద్ధనౌకలతో పాటు అందమైన తెరచాపలతో కూడిన నాటు పడవలు, దేశీయ నౌకలు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *