Tuesday, 3 November 2026

“స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ” వేడుకల పై కేసీఆర్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ జ‌నంసాక్షిః

హైద‌రాబాద్ : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుక‌ల‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కే కేశ‌వ‌రావు క‌మిటీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. వ‌జ్రోత్స‌వ వేడుకల కార్యాచరణను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కార్యాచరణను ఖరారు చేస్తారు..