హైదరాబాద్: అసెంబ్లీలో స్వపక్ష శాసన సభ్యుల తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే తగు రీతిలో పోరాడడం లేదంటూ ఆయన నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పై చర్చ జరగకుండానే స్పీకర్ సభను వాయిదా వేసుకుంటూ పోతే ఎందుకు అడ్డుకోలేక పోయారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు గంటతు కూడా సభలో కూర్చోలేనివారు రాజకీయాలు ఎలా చేస్తారని చంద్ర బాబు చురకలు వేశారు., మంత్రులు స్పీకర్‌నుంచి మైక్ తీసుకుని ఇష్టాను సారంగా మాట్లడుతుంటే ఎంచేస్తున్నారంటూ నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలను సీరీయస్‌గా తీసుకోవాలన్నారు.




