విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర తీరం వెంబడి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో
కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లుఉ కురిసే అవకాశముంది. రాగల 48 గంటల్లో శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృాష్ణా, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పటు చోట్ల భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో పార్వతీపురం, తెర్లాంలో 7సెంటీ మీటర్లు, నవీపేట సాలూరు, బొబ్బిలిలో 6సెం,మీ, నూజివీడు, వీరఘట్టం, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌లలో 5 సెం.మీల వర్షపాతం నమోదైంది.




