స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
ముంబయి: స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. మంగళవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మార్కెట్లో సానుకూల పవనాలు వీచడానికి దోహదపడ్డాయి. 10 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 18,635 వద్ద ముగిసింది, నేషనల్ స్టాక్ ఎక్స్ంజ్ నిఫ్టీ కూడా ఒక పాయింట్ లాభపడి 5,665 వద్ద ముగిసింది.



