స్వీడన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
ఢిల్లీ: స్వీడన్, జర్మనీ, యూకేలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ చేరుకున్నారు. రాజధాని స్టాక్హోమ్ చేరుకున్న మోదీకి స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లొఫ్వెన్ స్వయంగా విమానాశ్రమానికి వచ్చి స్వాగతం పలికారు. మోదీ బసచేసే హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. నేడు స్టెఫాన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం రెండు దేశాలకు చెందిన దిగ్గజ వ్యాపారవేత్తలతో ఇరువురు ప్రధానులు సమావేశమవుతారు. స్వీడన్ పర్యటన అనంతరం జర్మనీ, యూకేలో ఏప్రిల్ 20వరకు మోదీ పర్యటించనున్నారు.