స్వైన్ ఫ్లూ బారిన పడి దేశవ్యాప్తంగా రెండు వేల 84 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మొత్తం 34 వేల 240 మందికి స్వైన్ ఫ్లూ సోకగా.. 2 వేల 84 మంది మృతిచెందినట్లు తెలిపింది. గుజరాత్‌లో అత్యధికంగా 433 మంది రోగులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.




