సిఐటియు మండల కార్యదర్శి. అన్న బోయిన రాజు
^బచ్చన్నపేట మార్చి 20 (జనం సాక్షి): హమాలీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సిఐటియు మండల కార్యదర్శి అన్న బోయిన రాజు డిమాండ్ చేశారు. సోమవారం రోజున హమాలీ సంఘం మండల అధ్యక్షులు భావనపల్లి పెంటయ్య ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం ముందు హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారి డిమాండ్లు నెరవేర్చాలని నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేకపోవడంతో నష్టపోతున్నటువంటి హమాలీ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు 6000 పెన్షన్ మంజూరు చేయాలని ఐకెపి కేంద్రాల్లో హమాలీలకు రైతుల నుండి కాకుండా ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలన్నారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల తహశీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం మండల కార్యదర్శి ఏల కొమురయ్య పి సత్తయ్య గుండ సిద్ధులు కుక్క సావు నర్సింలు పి కనకయ్య నరసింహులు హమాలీ కార్మికులు పాల్గొన్నారు
హమాలీ కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలి




