హరిబాబు ఆకస్మిక మరణానికి సంతాపం.

సి పి ఐ పార్టీ, భవన నిర్మాణ కార్మికులు.

బూర్గుంపహాడ్ సెప్టెంబర్ 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధి తాళ్ల గోమ్మూరులో తాపీ మేస్త్రి పెరుమాల హరిబాబు ఆకస్మిక మృతికి స్థానిక మండల సి పి ఐ పార్టీ నాయకులు, భవన నిర్మాణ కార్మికుల యునియన్ సంతాపం తెలియజేశారు. సారపాక సెంటర్ లో తాపీ మేస్త్రీలు మృతి చెందిన తాపీ మేస్త్రి హరిబాబు ప్లెక్సీ తో ప్రదర్శన చేసి, సినిమాహాల్ సెంటర్లో మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు. ప్రదర్శన కార్యక్రమంలో భావన నిర్మాణ యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.