Thursday, 5 November 2026

హలీం తయారీదారులకు మార్గదర్శకాలు విడుదల

నాణ్యత పాటించాలన్న మేయర్‌
హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): హలీం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆరోగ్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ¬టల్‌ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తయారీలో నాణ్యమైన ఆహార వస్తువులను మాత్రమే వినియోగించాలని, శుభ్రతను పాటించాలని, ప్రమాదాలకు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన మేయర్‌ వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేయర్‌ రామ్మోహన్‌ ¬టల్‌ నిర్వాహకులతో జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్‌ సందర్భంగా 40 రోజులపాటు నగరంలో భారీగా హలీం విక్రయాలు సాగుతాయని, ఈ సందర్భంగా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ¬టళ్ల నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. ఉత్తమ ¬టళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు, నిబంధనలు ఉల్లంఘిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్‌ బాబాఫసియుద్దీన్‌తోపాటు పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.   హలీం బట్టీలను గ్రౌండ్‌ఫ్లోర్‌లో మాత్రమే ఏర్పాటు చేయాలి.  హలీం విక్రయశాలల వద్ద ¬టల్‌ యజమానులు తగినంత పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలి.  50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదు.  మాంసాన్ని జీహెచ్‌ఎంసీకి చెందిన కబేళాల నుంచే సేకరించాలి. అక్రమ జంతువధ నిషేధం.  ¬టళ్లలో తగిన శుభ్రతను పాటించాలి.   ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు ఆక్రమించరాదు. ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలి.  ప్రజా భద్రత, అగ్నిమాపక చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ఇది ¬టల్‌ నిర్వాహకుల బాధ్యత.  వ్యర్థాలను రోడ్డుపై పారవేయరాదు. చెత్త కుండీల్లో మాత్రమే వేయాలి.
తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా ఉంచి బల్దియా సిబ్బందికి అందించాలి. ఈ నిబంధనలు పాటించి హలీమ్‌ తయారీకి మరింత ప్రాధాన్యం తేవాలన్నారు.