హైదరాబాద్,మే12(జనం సాక్షి ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ, ఏపీలో వేర్వేరుగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. జూన్ 29న ఎన్నిక, ఈ నెల 17 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ 52 వేల మందికి ఓటు హక్కు ఉంది. తెలంగాణలో 23 వేల మంది, ఏపీలో 29 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో రాష్ట్రంలో బార్ కౌన్సిల్‌కు 25 మంది చొప్పున ఎన్నికవుతారు.
తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు నోటిఫికేషన్




