Thursday, 5 November 2026

హాత్ సే హాత్ జోడో కార్యక్రమం తరహాలో ఇంటింటికీ కాంగ్రెస్-మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్.

 

చేవెళ్ల ప్రజా గర్జన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారు.సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.తిరగబడదాం… తరిమికొడదాం కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి.కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్స్, ఛార్జ్ షీట్స్, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలి.హాత్ సే హాత్ జోడో కార్యక్రమం తరహాలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలి.