Wednesday, 4 November 2026

హాత్ సే హాత్ జోడో యాత్రకు విశేష స్పందన.

 

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.మే6 హాత్ సే హాత్ జోడో యాత్ర కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ అన్నారు.ఆదివారం వినాయక నగర్ డివిజన్ లోని హిల్ టాప్ కాలనీ, వాజ్ పెయి నగర్ లో  హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునే సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చిన నేటివరకు మల్కాజిగిరి లో డిగ్రీ కళాశాల కు పక్క భవనం లేదని విమర్శించారు.ఇంటింటికీ మంచినీరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.పాదయాత్రలో ప్రజలు సూచించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి 15 రోజుల్లో సమస్యలు పరిస్కరించెలా కృషి చేస్తామని కానీ ఎడల ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో వెంకటేష్ యాదవ్,సంతోష్ ముదిరాజ్, గుత్తి రామచందర్,ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్,గిరి యాదవ్,ఆశ,జీకే సాయి, సాయి,సత్యనారాయణ,బాలకృష్ణ, సాయికుమార్,సుబ్బారెడ్డి,మెమిన్ భాష,శ్రీనివాస్ గౌడ్,బికే శ్రీనివాస్,కుట్టి శ్రీనివాస్ యాదవ్, సూర్య ప్రకాష్,రెబ్బ వాసు,విట్టల్,బుచ్చిబాబు,వేణు, అజయ్,ప్రవీణ్,షేక్,చంద్రశేఖర్,పవన్, సూర్య ప్రకాష్ రెడ్డి,సాయికుమార్, మాధవి,ప్రభా తదితరులు పాల్గొన్నారు.