Tuesday, 3 November 2026

హాల్‌మార్క్‌ నిబంధనలపై నగల వ్యాపారుల ఆందోళన

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): హైదరాబాద్‌లో బంగారం వ్యాపారుల సమ్మె కొనసాగుతోంది. బషీర్‌బాగ్‌ వద్ద నగల వ్యాపారులు ఆందోళనకు దిగారు. హాల్‌ మార్క్‌లో కొత్త నిబంధనలపై వ్యాపారుల నిరసన చేపట్టారు. ఇకపై హాల్‌ మార్క్‌తో పాటు యూనిక్‌ ఐడెంటిటీ నెంబర్‌ బీఐఎస్‌ ఇవ్వనుంది. కాగా యూనిక్‌ ఐడెంటిటీ నెంబర్‌ను చిన్న వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. వ్యాపారులకు నష్టం కలిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అదనపు భారం తప్ప మరోటి లేదన్నారు.