Thursday, 5 November 2026

హాస్యనటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

xij8imfoహైదరాబాద్‌: రంగస్థల, సినిమా నటుడు కళ్లు చిదంబరం(70) ఈరోజు కన్నుమూశారు. ఆయన స్వస్థలం విశాఖలోని అక్కయ్యపాలెం. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కళ్లు చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిదంబరం ఎన్నో చిత్రాల్లో తనదైన హాస్యంతో ప్రేక్షకులను సుదీర్ఘ కాలం పాటు నవ్వించారు. తొలి సినిమా ‘కళ్లు’ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. తొలి చిత్రంతోనే నంది పురస్కారం అందుకున్నారు. నాటక రంగంలో 12 ఏళ్ల పాటు ఆయన సేవలు అందించారు.నాటకరంగ కళాకారుల కోసం విశాఖలో 1600 మంది కళాకారులతో సకల కళల సమాఖ్య ఏర్పాటు చేశారు. నాటకరంగంలో అప్పులపాలు కావడంతో 1989తో ‘కళ్లు’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొండవీటి దొంగ, చంటి, మనీ, గోవిందా గోవిందా, అమ్మోరు, పెళ్లిపందిరి, ఫతిల్స్‌, మృగరాజు, శ్వేతనాగు, గ్లామర్‌, సివంగి, గంగపుత్రులు, కాలచక్రం, ఆకారం, తొలిపాట, మైత్రి, ఆ అంతస్థులో, ప్రేమకు సై, శ్రీసాయి సంకల్పం తదితర సినిమాల్లో ఆయన నటించారు
+

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *