Wednesday, 4 November 2026

హెల్త్‌ హబ్‌గా మారిన హైదరాబాద్‌

గుండె జబ్బుల వల్ల అత్యధిక మరణాలు

కార్డియోలాజికల్‌ సొసైటీ వార్షిక భేటీలో మంత్రి ఈటల

హైదరాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌ గా మారిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేషెంట్స్‌ ఇక్కడికి వస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు. గుండె జబ్బుల వల్ల దేశంలోనే అత్యధిక మరణాలు తెలంగాణలో జరగడం ఆందోళనకరం అన్నారు. 25 ఏళ్లకే గుండె జబ్బులు రావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. సంపద సృష్టి పెరిగిందని, దానితోపాటే టెన్షన్‌ కూడా ఇక్కడ పెరిగిందని అభిప్రాయపడ్డారు.టెన్షన్‌ లేకుండా బతకడం గొప్ప విషయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మానవీయ విలువలు, మానవ సంబంధాలు పెంచి ప్రశాంత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రూరల్‌ ఎకానవిూని పెంచి.. గ్రావిూణ జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పేషెంట్లకు డాక్టర్లే దేవుళ్ళని, ఆ గొప్పదనాన్ని కాపాడుకోవాలని సూచించారు. హైదరాబా/-లో జరిగిన కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా తెలంగాణ చాప్టర్‌ నాలుగో వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మన పూర్వీకుల కాలంలో ఇంత సంపద లేదు కానీ.. ప్రశాంతత ఉండేదన్నారు. ప్లలెల్లో మంచి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండేవారని, కానీ ఈ రోజుల్లో గ్రామాల్లో ఉండేవారికి కూడా జబ్బులు వస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ వచ్చిన తరువాత శారీరక శ్రమ తగ్గిందని, దీంతో రోగాలు పెరిగినయని వివరించారు. జబ్బు రాకముందే నివారించుకోవాలని సూచించారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ బాధ తీర్చలేనిదని మంత్రి రాజేందర్‌ చెప్పారు. పెద్ద జబ్బు వస్తే డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలపై స్వామినాథన్‌ కమిషన్‌ రిపోర్ట్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ బాధ, వేదన లేకుండా.. రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని వెల్లడించారు. కొత్త పథకాలతో ముందుకు వస్తామని ప్రకటించారు. హాస్పిటల్స్‌ కు ఇబ్బందులు లేకుండా చేస్తామని హావిూ ఇచ్చారు. కార్డియోలాజికల్‌ అసోసియేషన్‌ కి భూమి ఇచ్చే విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.