Thursday, 5 November 2026

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: అజారుద్దీన్‌

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వివేక్‌ పదవి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. వివేక్‌ ప్యానల్‌ ఎంపికలో అవకతవకలు జరిగాయని తాను మొదట్నుంచీ చెబుతున్నానన్నారు. అంబుడ్స్‌ మెన్‌ వివేక్‌పై తీసుకున్న నిర్ణయం సరైందేనని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. వివేక్‌ ప్యానల్‌పై తాను తొలి నుంచీ పోరాటం చేస్తున్నానన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఈరోజు న్యాయం జరిగిందని అజహర్‌ సంతోషం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తదుపరి కార్యాచరణపై సర్వసభ్య సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు.