Tuesday, 3 November 2026

హైటెక్‌ సిటీకి 20 ఏళ్లు 

చంద్రబాబుకు ఐటీ ఉద్యోగుల కృతజ్ఞతలు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  హైటెక్‌ సిటీ పేరు వింటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. 1998లో హైటెక్‌ సిటీ ప్రారంభించి.. ఐటీ అభివృద్ధికి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో బాటలు వేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగం ద్వారా వేల కోట్ల రూపాయల రాబడి సాధిస్తోందంటే.. ఆనాటి చంద్రబాబు సర్కార్‌ కృషే కారణమన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు. 1998లో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఈ ఏడాదితో 21ఏళ్లు పూర్తి చేసుకుంది. హైటెక్‌ సిటీ వార్షికోత్సవాన్ని స్థానిక ఐటీ నిపుణులు, టీడీపీ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆనాడు కట్టిన సైబర్‌ టవర్స్‌ విశిష్టతను నేటి తరానికి తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. ఆయన దార్శనికత వల్లే ఐటీ రంగంలో ఇంత అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇదిలా ఉంటే, హైటెక్‌ సిటీ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు సోమవారం చంద్రబాబును కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన కృషి వల్లే ప్రతి ఇంటి నుంచి ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వచ్చారని.. ఆయన వల్లే అమరావతి కూడా సాధ్యమవుతుందని విద్యార్థినులు తెలిపారు. ఆయనతో పాటు తామంతా ఉంటామన్నారు.