Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, పాతబస్తీ, జియాగూడ, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్‌, కూకట్‌పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలకు బయలుదేరిన విద్యార్థులు, వాహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు.

కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎఫ్‌, మున్సిపల్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.