హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శనివారం హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్సారీకి జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా తన మంత్రివర్గ సభ్యులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు.
హైదరాబాద్‌కు విచ్చేసిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ




