Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్ మొఘల్‌పురాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వోల్టా హోటల్ సమీపంలోని దర్గా దగ్గర ఉన్న పాత ఫర్నీచర్ షాపులో ఈ దుర్ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ, ఎలాంటి హానీ జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *