హైదరాబాద్,జూన్20(జనం సాక్షి ): హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డు లభించింది. పాస్‌పోర్టుల జారీలో అత్యుత్తమ సేవలకుగాను పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పోర్టు అధికారి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ..జూన్ 1 నుంచి పాస్‌పోర్ట్ జారీ, పోలీసుల విచారణలో మార్పులు జరిగాయన్నారు. ఈ మూడేళ్లలో తెలంగాణ పోలీసులు కొత్త పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నారని అన్నారు. జారీ ప్రక్రియను సరళతరం చేయడంతో ప్రజలకు సులువుగా పాస్‌పోర్టు పొందగలిగే అవకాశం పెరిగిందన్నారు.




