Tuesday, 3 November 2026

హైదరాబాద్ : మిస్టరీగా తల్లీ, కుమార్తె అదృశ్యం

 

fpmuz6tmహైదరాబాద్‌, ఆగస్టు 29 : నగరంలో తల్లీ, కుమార్తె అదృశ్యం మిస్టరీగా మారింది. నాగులచవితికని చంద్రకళ అనే మహిళ కుమార్తెతో కలిసి బీదర్ నుంచి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి బంధువులు వీరిద్దరినీ బీదర్ వెళ్లే రైలు ఎక్కించి చంద్రకళ భర్తకు సమాచారం అందించారు. ట్రైన్ వచ్చినా భార్య, కుమార్తె సమాచారం తెలియకపోవడంతో చంద్రకళ భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటు హైదరాబాద్‌లోనూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌లో తల్లీ,కూతుళ్లు ట్రేన్ దిగినట్లు కనిపించకపోవడంతో కుటుంబసభ్యలు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *