హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం తల పెట్టనున్న సమరదీక్షకు అనుమతినివ్వాలని కోరుతూ గద్దర్, చుక్కారామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, డా, కిషన్ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమరదీక్షకు అనుమతి ఇస్తామని హోంమంత్రి హామి ఇచ్చినట్లు వారు తెలిపారు.




