హోలీ వేడుకల్లో హోంమంత్రి

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసం వద్ద హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాల్లో పాల్గొన్నారు. హోలీ విషెష్ చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ రాజ్‌నాథ్‌ హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు.