Tuesday, 3 November 2026

సామాజికవేత్త సునీతాకృష్ణన్‌ ఉద్యమానికి స్పందన

ఆ మృగాళ్లు ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తింపు

హైద‌రాబాద్ జ‌నంసాక్షి : సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ ఆ దృశ్యాలను యూట్యూబ్‌లో పెట్టిన మృగాళ్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. రివర్స్‌ ఇన్వస్టిగేషన్‌లో పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ కేసును యూపీకి బదిలీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. యూట్యూబ్‌ దృశ్యాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించాలంటూ సోషల్‌మీడియాలో సునీతాకృష్ణన్‌ చేపట్టిన ఉద్యమం నేపథ్యంలో ఆమె కారుపై దాడి కూడా జరిగింది. దీంతో యువతిపై సామూహిక అత్యాచారం, సునీతకృష్ణన్‌పై దాడి ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మీడియా కథనాల ద్వారా యువకులను గుర్తించిన వారు ఇద్దరు నిందితుల సమాచారాన్ని సునీతాకృష్ణన్‌కు మెయిల్‌ చేశారు. అందులో ఒకడు ఉత్తరప్రదేశ్‌ వాసిగా గుర్తించారు. ఈ మెయిల్‌ వివరాలతో పాటు అత్యాచార ఘటనపై సునీతాకృష్ణన్‌ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేయనున్నారు. తన వద్ద ఉన్న పూర్తి వివరాలను సోమవారం హోంమంత్రికి అందజేయనున్నట్లు ఏబీఎన్‌కు సునీతాకృష్ణన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *