Tuesday, 3 November 2026

ఆ హోటల్‌లో 10 వేల గదులు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : సాధారణంగా హోటల్‌ అంటే నూరు నుంచి రెండువందల వరకు గదులుంటాయి. అయితే జర్మనీలోని రూజెస్‌లోని ప్రొరాలో ఉన్న హోటల్‌లో మాత్రం 10 వేల గదులుండటం విశేషం. బాల్టిక్‌ సముద్రతీరంలో 1936-39 మధ్య ఈ భారీ హోటల్‌ను నాజీ పాలకుడైన హిట్లర్‌ ఆధ్వర్యంలో నిర్మించారు. జర్మనీలో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందనే ఆలోచనతో ఈ భారీ నిర్మాణాన్ని ఎనిమిది బ్లాకులుగా నిర్మించారు. ఇన్ని గదులున్న ఈ హోటల్‌లో ఇప్పటి వరకుఒక్క అతిథి కూడా రాకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *