Tuesday, 3 November 2026

తెలంగాణోళ్లకు ఎవుసం రాదన్నోడెవడు?

నేను కోట్ల రూపాల పంట పండించిన

యువత వ్యవసాయం వైపు మళ్లాలి

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌

మెదక్‌, జనవరి 2 (జనంసాక్షి) :

తెలంగాణోళ్లకు ఎవుసం దాదన్నదెవడని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మండిపడ్డారు. తాను కోట్లాది రూపాయల పంటపడించినట్లు ఆయన పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండంలంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. వ్యవసాయరంగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని ఆయన మండిపడ్డారు. ఇక్కడ రైతులు ఎంతగా కష్టపడ్డా వారికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను ప్రోత్సహిస్తూనే వారికి మెళకువులను నేర్పేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో పభుత్వం వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వట్లేదన్నారు. వ్యవసాయ శాఖలో విస్తరణ విభాగం నిర్వీర్యమైందని, వ్యవసాయ నిపుణులకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నారు. గతకొంత కాలంగా తెలంగాణ రైతాంగం పట్ల క్రమంగా వివక్షను కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరవాత వీటన్నిటిని సమీక్షించి మేలైన చర్యలకు శ్రీకారం చుడతామని అన్నారు.  వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్‌ రంగాలు గణనీయంగా అభివద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాల పంటలు పండే భూములున్నాయని, విత్తన ఉత్పత్పి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక ప్రతి దళిత రైతుకు మూడు ఎకరాల భూమిని ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమి ఇవ్వటంతోటే సరిపెట్టుకోకుండా దానికి నీటి కేటాయింపు, ఆధునిక పద్దతుల ద్వారా ఫలవంతంగా వ్యవసాయం ఎలా చేసుకోవాలో రైతుకు ప్రభుత్వ అధికారులు నేర్పుతారని వెల్లడించారు. విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు భారీ స్థాయిలో సోలార్‌ పవర్‌ సిస్టమ్‌ను ప్రొత్సహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి రికార్డు చేయించి దాని ఆధారంగా కమతాలను విభజించి అవసరమైన పంటలను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలొస్తాయని చెప్పారు. ఉచిత విద్యుత్‌తో సరిపెట్టుకోకుండా రైతులకు సాంకేతికపరమైన శిక్షణను అందించాల్సిన అవసరముందని కేసీఆర్‌ సూచించారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ఆదరించినట్లైతే యువత వ్యవసాయరంగంపై దృష్టి సారిస్తదని తెలిపారు.ఞప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వడం లేకపోవడం వల్లనే ఈ రంగం నిర్వీర్యమైందని కేసీఆర్‌ అన్నారు.  వ్యవసాయ శాఖలో విస్తరణ విభాగం నిర్వీర్యమైందని, నిపుణులకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామని, ప్రతి దళిత రైతుకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *