కర్నూలు: శ్రీశైలం జలిశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో జలాశయం నిండిపోయింది. ఎగువ ప్రాంతం నుంచి లక్షల క్యూస్కెక్కుల వరద నీరు వస్తుండటంతో డ్యాంకు ఉన్న 12 గేట్లును ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు.




