Tuesday, 3 November 2026

100 ఓట్ల సర్వే చేస్తున్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్

100 ఓట్ల సర్వే చేస్తున్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్
వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్
ఆదేశాల మేరకు హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో 100ఓట్ల ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తన బూత్ లో 100ఓట్ల భాధ్యత తీసుకొని ఇంటింటికీ సర్వే చేస్తున్న GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ . ఈ కార్యక్రమంలో ప్రజలు వారు వారి సమస్యలు మరియు వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందుతున్న పథకాలను శ్రీధర్ కి తెలిపారు.అనంతరం పావుశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే పట్టం కట్టాలని ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంకా ఏమైనా పథకాలు పొందకపోయిన ఆ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి అమలు అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు తోట కృష్ణమూర్తి,యూత్ నాయకులు కందుకూరి సాయి చందు,కాజీపేట అన్నమాచార్య తదితరులున్నారు.