Tuesday, 3 November 2026

పసికందు అదృశ్యం: ఆసుపత్రి ఎదుట బంధువుల ధర్నా

తిరుపతి: తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించింది. రేణిగుంట మండలం వడ్డిమిట్టకు చెందిన కమల శనివారం ప్రసూతి వైద్యశాలలో అడశిశువుకు జన్మనిచ్చింది. సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని మహిళ ఆసుపత్రి నుంచి పసికందును అపహరించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం పై కమల దంపతులు, వారి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *